మనవార్తలు ,రామచంద్రపురం
టీఆర్ఎస్ ఏడేళ్ళ పాలనలో ఒక్కరికి డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఇచ్చిన పాపాన పోలేదని బీజేపీ రాష్ట్ర మహిళా మాజీప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి అన్నారు. పటాన్ చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సుమారు 38 వేలకు పైగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు గొప్పగా ప్రకటించారని ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. దీంతో పాటు జిహెచ్ఎంసి పరిధిలో మరో 40 వేల డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారని తెలిపారు .వీటిలో స్థానికులకి 10 శాతం కనీసం 4 వేల ఇళ్లు కూడా పంపిణీ చేయలేదన్నారు .పటాన్ చెరు నియోజకవర్గానికి 2014 నుంచి ఇప్పటివరకు ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు .
నియోజకవర్గంలో ,మండలంలో, జిహెచ్ఎంసి పరిధిలో ఎన్ని డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఏ ఏ గ్రామంలో నిర్మించాలో చెప్పాలన్నారు .డబుల్ బెడ్ రూం ఇళ్ళకు ఎన్ని నిధులు ఇచ్చారో వెల్లడించాలని రాష్ట్ర మహిళా మాజీ ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి ప్రశ్నించారు.ఏడేళ్ల పాలనలో నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా ఇచ్చారా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు .
ఎమ్మెల్యే చెబుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లెక్కలు పూర్తిగా ఆ వాస్తవమని టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి 2022 దాకా జిహెచ్ఎంసి పరిధి కాకుండా కేవలం 400 డబుల్ బెడ్రూం ఇళ్లు మాత్రమే మంజూరు అయ్యాయి అందులో ఒక్క ఇంటి నిర్మాణం కూడా పూర్తి కాలేదు. 400 ఇళ్లలో చిట్కుల్ లో 150, ముత్తంగి లో 100 , కొడకంచిలో 50 , జిన్నారంలో 60, కొత్తపల్లి లో 40 డబుల్ బెడ్రూం లు నిర్మాణంలో ఉన్నాయి. ఇవి కూడా 2015- 16 లో మంజూరు చేశారు నాటి నుంచి మళ్ళీ ఒక్కటైనా మంజూరు చేసిన పాపాన పోలేదు. ఇవన్నీ మేం సొంతంగా తయారు చేసి చెబుతున్న సంబంధిత ప్రభుత్వ శాఖలు ఇచ్చిన వివరాలు జిహెచ్ఎంసి పరిధిలో 40 వేల ఇళ్లు అని చెప్పారు .ఇది కూడా పూర్తి అసత్యం అని కొల్లూరు లో 15 వేల ఇల్లులు ఉంటె అందులో 10 శాతం వాటా అంటే 1500 ఇళ్లు స్థానికులకు వస్తాయి.
మరి 38 వేల డబుల్ బెడ్రూం ఇళ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని ఎమ్మెల్యే ఏ విధంగా చెప్పారని ప్రశ్నించారు.38 వేల ఇళ్లు ఎక్కడ కట్టారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు .లేకపోతే ప్రజలను మభ్య పెట్టేందుకు ఎమ్మెల్యే అబద్దాలు చెబుతున్నారని నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పై ఎమ్మెల్యే బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. 38 వేల ఇళ్లను ఎమ్మెల్యే చూపించలేకపోతే అవాస్తవాలు చెప్పినందుకు నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాలని బిజెపి రాష్ట్ర మహిళా మాజీ ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమలో మల్లేష్, రవీండెర్ గౌడ్, అమృత, అజాజ్, శాస్త్రీ, శివ, శిల్ప, నరసింహ తదితరులు పాల్గొన్నారు.