వనజ కోవిడ్ హాస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

politics
వనజ కోవిడ్ హాస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే…..
చందానగర్:
చందానగర్ హుడా కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన వనజ కోవిడ్ హాస్పిటల్ ను శుక్రవారం రోజు శేరిలింగంపల్లి  ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరేకపూడి గాంధీ ముఖ్యఅతిధిగా హాజరై ప్రారంభించారు.
అనంతరం అయన మాట్లాడుతూ…… కరోనా మహమ్మారి పట్టిపిడుస్తున్న ఈ  సమయంలో లో ప్రత్యేకంగా కోవిడ్ హాస్పిటల్ ను ప్రారంభించి, వైద్య సేవాలు అందించడం అభినందనీయం అని అయన కొనియాడారు. ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని, రోగులకు ఏ ఇబ్బందులు రాకుండా చూసువాల్సిన బాధ్యత హాస్పిటల్ నిర్వాహకుల పై ఉందని అయన అన్నారు.
ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని కోరారు. ప్రజలు ఎవరు కూడా అధైర్య పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హాస్పిటల్ నిర్వకులు కే ఎల్ మూర్తి మాట్లాడుతూ ఈ హాస్పిటల్ లో కోవిడ్ కు ప్రత్యేకంగా హాస్పిటల్ ఏర్పాటు చేశామన్నారు. కోవిడ్ కు సంబందించిన అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో వున్నాయి అని తెలిపార. రోగులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశామని, నిరభ్యంతరంగా తమ హాస్పిటల్ కు రావొచ్చునని చక్కటి ఆరోగ్యం తో తిరిగి వెళ్లవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమం లో హాస్పిటల్ నిర్వాహకులు  డాక్టర్ వనజ, డాక్టర్ సుదర్శన్ రెడ్డి, డాక్టర్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.