మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
పటాన్‌చెరు నియోజకవర్గంలో ఒక వైపు అభివృద్ధి మరో వైపు సొంత నిధులతో దేవాలయాలు, మసీదులు, చర్చిలు నిర్మిస్తూ ప్రజల్లో ఆధ్యాత్మిక భావం పెంపొందిస్తున్నారు పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు. అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక విలువల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ఆలయాల నిర్మాణం, పునర్నిర్మాణ కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తున్నారు.
తాజాగా జేపీ కాలనీ డివిజన్ పరిధిలోని సింఫనీ కాలనీలో గురువారం ఉదయం శివాలయం, రామాలయం, అమ్మవారి దేవాలయాల నిర్మాణాలకు భూమి పూజ నిర్వహించారు. అనంతరం బండల మల్లన్న దేవాలయం ఆవరణలో చౌడమ్మ దేవాలయం నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ నూతన దేవాలయాలు, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు సొంత నిధులు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలలో ఆధ్యాత్మిక భావం పెంపొందించడంలో భాగంగా పటాన్‌చెరు నియోజకవర్గం వ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా దేవాలయాలు, మసీదులు, చర్చిలు నిర్మిస్తూ పరమత సహనాన్ని పెంపొందిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు పృథ్వీరాజ్, చంద్రశేఖర్, మల్లేష్ యాదవ్, సుధాకర్, విజయ్, వెంకటేష్, ధనరాజ్ గౌడ్, రాజు, నాగమల్లేష్, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…