ఓటు హక్కు ప్రాధాన్యతను స్వయంగా వివరించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Districts politics Telangana

_చౌటుప్పల్ లో నూతనంగా ఓటు హక్కు పొందిన ఓటర్ల ఏకగ్రీవ తీర్మానం

మనవార్తలు ,చౌటుప్పల్:

బంగారు తెలంగాణలో భాగస్వాములు అయ్యేందుకు మునుగోడు ఉపఎన్నిక సువర్ణ అవకాశం కల్పించిందని, తమందరి ఓటు టిఆర్ఎస్ పార్టీకేనని చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు లింగారెడ్డిగూడెంలో నూతనంగా ఓటు హక్కు పొందిన యువతరం ఓటర్లు ఏకగ్రీవ తీర్మానం చేశారు.మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 1, 13వ వార్డుల ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు గురువారం లింగారెడ్డిగూడెంలో నూతనంగా ఓటు హక్కు పొందిన యువతి యువకులతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువను సవివరంగా వివరించారు. ఓటు వేసే విధానాన్ని నమూనా బ్యాలెట్ ద్వారా అవగాహన కల్పించారు. స్వరాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన యువత, బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలని కోరారు. నూతనంగా ఓటు హక్కు పొందిన ప్రతి యువతి, యువకుడు మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయానికి కృషి చేయాలి ఆయన కోరారు.

మా సంపూర్ణ మద్దతు టీఆర్ఎస్ కే..
యువత ఏకగ్రీవ తీర్మానం

నూతనంగా ఓటు హక్కు పొందిన యువ ఓటర్లు మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయానికి సంపూర్ణ మద్దతు అందిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. టిఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ కి బహుమతిగా అందిస్తామని వారు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *