క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

కరుణామయుడు ఏసుక్రీస్తు బోధనలు, జీవితం ప్రతి ఒక్కరికి అనుసరనీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని పటాన్చెరు మండలం పాటి గ్రామ చౌరస్తాలో గల మరనాత చర్చిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద పండుగ క్రిస్మస్ అన్నారు. విశ్వ శాంతి దూత, దేవుని కుమారుడు భూమి మీద అడుగు పెట్టిన శుభదినం అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పరమత సహనం, దైవ చింతన అలవాటు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయకుమార్, సీనియర్ నాయకులు వెంకటేష్, ధనరాజ్ గౌడ్, చర్చి నిర్వాహకులు భాస్కర్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *