పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : దివంగత రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా పటాన్చెరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో గల ఆయన కాంస్య విగ్రహానికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పూలమాల వేసి వినమ్ర నివాళులు అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. అత్యంత నిరుపేద కుటుంబం నుండి జీవితాన్ని ప్రారంభించి దేశానికి రాష్ట్రపతి అయ్యారని గుర్తు చేశారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ అశోక్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, వెంకటేష్, అజ్మత్, రుద్రారం శంకర్, రాజు, ఇమ్రాన్, కొండల్, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…