పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
దశాబ్దాల చరిత్ర గలిగిన పటాన్చెరు మైత్రి క్రికెట్ క్లబ్ భవిష్యత్తులోను ఇదే తరహాలో క్రికెట్ అభివృద్ధికి కృషి చేయాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. ఆదివారం పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో నూతనంగా ఏర్పాటు చేసిన మైత్రి క్రికెట్ క్లబ్ కార్యాలయం, నూతన కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలతో స్టేడియాన్ని పునరుద్ధరించడం జరిగిందని తెలిపారు. సంవత్సరం పొడవునా వివిధ రకాల క్రీడా పోటీలకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, దశరథ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.