Telangana

గ్రామాల అభివృద్ధికి పరిశ్రమల సహకారం అభినందనీయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

రుద్రారం గ్రామంలో ఒక కోటి 68 లక్షల రూపాయల అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గ్రామాల అభివృద్ధిలో పరిశ్రమలు భాగస్వాములు కావడం అభినందనీయమని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలో తోషిబా పరిశ్రమ సహకారంతో కోటి 8 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన పల్లె దవఖాన భవనం, మూడు ఆరో ప్లాంట్లను ఆయన ప్రారంభించారు. అనంతరం 60 లక్షల రూపాయల గ్రామపంచాయతీ నిధులతో చేపట్టనున్న సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానాలు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ప్రతి పల్లె దవాఖానాలో వైద్యుడు తో పాటు ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రుద్రారం గ్రామ అభివృద్ధికి తోషిబా సంస్థ సహకారం అందించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులోనూ గ్రామ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ పాండు, మండల పంచాయతీ అధికారి హరిశంకర్ గౌడ్, మాజీ ఎంపీటీసీలు హరిప్రసాద్ రెడ్డి, రాజు, వెంకన్న, తోషిబా సంస్థ ప్రతినిధి రామకృష్ణ, గ్రామ పుర ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

11 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

12 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago