పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
నిరుపేదల ఆరోగ్య సంరక్షణ కోసం ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని వాసవి కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య సంఘం పటాన్చెరు శాఖ, బండారు హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రామ్మోహన్ గుప్తా, ప్రముఖ వైద్యులు డాక్టర్ సుష్రుత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.