Telangana

మరోసారి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్

దివ్యాంగుడికి ఎమ్మెల్యే జిఎంఆర్ చేయూత

సొంత నిధులతో ఆటో అందజేత

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోయి వెన్నుపూస గాయంతో ఉపాధి లేక.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న దివ్యాంగుడికి అండగా నిలిచారు. సొంత నిధులతో ఆటో అందించి తన ఉదారతను చాటుకున్నారు.గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామానికి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో తన కుటుంబ సభ్యులను సైతం కోల్పోయాడు. తల్లితో కలిసి జీవనం కొనసాగిస్తున్నాడు. ప్రమాదంలో వెన్నుపూసకు గాయం కావడంతో ఉపాధి లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.స్వయం ఉపాధి కల్పించాలని ఇటీవల ఎమ్మెల్యే జిఎంఆర్ ను కలిసి విజ్ఞప్తి చేయగా. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జిఎంఆర్ 3 లక్షల రూపాయలు సొంత నిధులు వెచ్చించి ఆటో కొనుగోలు చేశారు. ఈ మేరకు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా విష్ణువర్ధన్ రెడ్డికి ఆటో అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని వికలాంగుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నామని తెలిపారు. గతంలో దేశంలోని మొట్టమొదటిసారిగా నియోజకవర్గ పరిధిలోని దివ్యాంగుల కోసం 400 స్కూటీలు అందించడం జరిగిందని గుర్తు చేశారు. భవిష్యత్తులోనూ అండగా నిలుస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, వెలిమల పిఎసిఎస్ చైర్మన్ బుచ్చిరెడ్డి, షకీల్, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

2 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

2 weeks ago