పటాన్చెరు
పర్యావరణానికి హాని కలిగించని మట్టి వినాయక ప్రతిమలను ప్రతి ఒక్కరూ పూజించాలని పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జిహెచ్ఎంసి, వ్యసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాయ్ హారిక విజయ్ కుమార్ లు సంయుక్తంగా పటాన్చెరులోని గాంధీ థీమ్ పార్క్ సర్కిల్ లో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుల ప్రతిమల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రతిమలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ పర్యావరణహిత వినాయక చవితిని జరుపుకోవాలని కోరారు.

కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ ఏడాది వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలని ప్రజలను ఎమ్మెల్యే జిఎంఆర్ కోరారు. మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను పూజించి పర్యావరణానికి హాని కలిగించకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, , టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి , విజయ్ కుమార్, యాదగిరి యాదవ్, టిఆర్ఎస్ యువనేత కొత్త గొల్ల మల్లేష్ యాదవ్, సీనియర్ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

