అమీన్పూర్
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని భ్రమరాంబికా కాలనీలో నూతనంగా నిర్మించనున్న శ్రీ శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయం నిర్మాణం భూమి పూజ కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, ఎంపీపీ దేవానందం, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, స్థానిక కౌన్సిలర్లు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.