అమీన్పూర్,,మనవార్తలు ప్రతినిధి :
మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని శ్రీ షిరిడి సాయి కాలనీలో మిషన్ భగీరథ పథకం ద్వారా ఏర్పాటు చేసిన నల్లా కనెక్షన్లను ఆయన ప్రారంభించారు. అనంతరం జవహర్ నగర్ కాలనీలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 9 లక్షల రూపాయల అంచనా వ్యయంతో మన ఊరు మనబడి పథకం ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. అనంతరం కృష్ణారెడ్డిపేట గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, ఎంపీపీ దేవానందం, జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, గ్రామ సర్పంచ్ నితీశా శ్రీకాంత్, నియోజకవర్గ ప్రత్యేక అధికారి శ్రీనివాస రావు, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…