పటాన్చెరు
జాతిపిత మహాత్మాగాంధీ జయంతి పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయం, ఆల్విన్ కాలనీ, ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో గల గాంధీ మహాత్ముడి విగ్రహాలకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అహింస అనే ఆయుధంతో ఆంగ్లేయులను తరిమికొట్టిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ అని కొనియాడారు.
మహనీయులు భౌతికంగా గతించినప్పటికిని వారు చూపిన మార్గం, అనుసరించిన విలువలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తి ప్రదాయకంగా నిలుస్తాయని అన్నారు. నేటికీ ప్రపంచంలోని ప్రతి దేశంలో గాంధీ చూపిన మార్గాన్ని అనుసరిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా జిహెచ్ఎంసి పరిధిలో సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హారిక విజయ్ కుమార్, ఎంపీపీ సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
రామచంద్రాపురం లో
రామచంద్రాపురం, భారతి నగర్ డివిజన్ల పరిధిలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి జాతిపిత గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాల్లో కార్పొరేటర్లు సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్, పార్టీ డివిజన్ల అధ్యక్షులు గోవింద్, పృథ్వీరాజ్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.