మన వార్తలు , పటాన్ చెరు:
పటాన్చెరు పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో శనివారము ఏర్పాటుచేసిన అయ్యప్పస్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు ఆలపించిన భక్తి గీతాలు అందర్నీ భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి. అనంతరం భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, గూడెం మధుసూధన్ రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, కార్యక్రమ నిర్వాహకులు ధర్పల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, భారీ సంఖ్యలో అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.