హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

హనుమాన్ జయంతి పర్వదినం పురస్కరించుకొని.. పటాన్చెరు డివిజన్ పరిధిలోని పంచముఖి హనుమాన్ దేవాలయం, చైతన్య నగర్ హనుమాన్ దేవాలయాలను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంజనేయుడి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కమిటీల సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ కు తీర్థప్రసాదాలు అందించి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, కంకర సీనయ్య, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *