గణేష్ గడ్డ శ్రీ సిద్ధి వినాయక స్వామి పల్లకి సేవ, రథయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్..

politics Telangana

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం గణేష్ గడ్డ శ్రీ సిద్ధి గణపతి దేవాలయంలో వినాయక చవితి పర్వదినం పురస్కరించుకొని నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా చివరి రోజైన శుక్రవారం సాయంత్రం దేవాలయంలో నిర్వహించిన స్వామివారి పల్లకి సేవ, రథయాత్ర కార్యక్రమాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్ చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి . స్వామి వారి కృపతో పటాన్చెరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. దేవాలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళుతున్నామని తెలిపారు. ఇప్పటికే రాజగోపురాలు పూర్తి చేయడం జరిగిందని , సాలహారం పనులు త్వరలో పూర్తికానున్నయని తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా 11 రోజులపాటు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే జిఎంఆర్ కు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఈవో లావణ్య ఆలయ సిబ్బంది ఉత్సవ కమిటీ సభ్యులు లక్ష్మారెడ్డి , కమిటీ సభ్యులు, కౌన్సిలర్లు లతా వెంకటేష్, పాండు, వడ్డె గడ్డ రాజు, మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి వెంకన్న గ్రామ పెద్దలు ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *