పటాన్చెరు
వర్షాకాలం లో పశువులకు వచ్చే గాలికుంటు వ్యాధిని అరికట్టేందుకు ప్రభుత్వం ఉచితంగా టీకాలను అందిస్తోందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. సోమవారం పటాన్చెరు మండలం నందిగామ గ్రామంలోని గోశాలలో టీకా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూక్ష్మమైన అప్తో వైరస్ నుండి గాలి ద్వారా ఈ వ్యాధి సోకుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం దూరదృష్టితో ప్రతి పశువుకు ఉచితంగా టీకా అందించేలా కార్యక్రమం రూపొందించిందని తెలిపారు. ప్రతి గ్రామంలో పశు వైద్య అధికారులు పర్యటిస్తారని, రైతులు విధిగా తమ పశువులకు టీకా వేయించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పశువైద్య విభాగం జాయింట్ డైరెక్టర్ వసంతకుమారి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, గోపాల్, నారాయణ రెడ్డి, లక్ష్మణ్, గోశాల నిర్వాహకులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…