ప్రణాళికాబద్ధంగా డివిజన్ల అభివృద్ధి
పటాన్చెరు
జిహెచ్ఎంసి పరిధిలోని మూడు డివిజన్లకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తూ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.
పటాన్చెరు డివిజన్ పరిధిలోని సీతారామపురం కాలనీ, గౌతమ్ నగర్ కాలనీలలో కోటి అరవై రెండు లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్లు, అంతర్గత మురికినీటి కాలువల నిర్మాణపనులకు గురువారం స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ నూతనంగా ఏర్పడుతున్న కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీలు, రక్షిత తాగునీరు, వీధి దీపాలు వంటి కార్యక్రమాలకు నిధులు నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరి భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, సీనియర్ నాయకులు కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.