అభివృద్ధి..సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్ళు
పటాన్చెరు
ప్రతి గ్రామంలో అభివృద్ధి.. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వైపు చూస్తున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన కోటీ 20 లక్షల రూపాయలతో పటాన్చెరు మండల పరిధిలోని నందిగామ, భానూరు, క్యాసారం, పాశమైలారం, ఇస్నాపూర్, ముత్తంగి, చిట్కుల్, లక్డారం, రుద్రారం గ్రామాల్లో చేపట్టనున్న సిసి రోడ్ల నిర్మాణ పనులకు ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పిటిసి సుప్రజా వెంకటరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేస్తున్నారనీ కొనియాడారు. ఈ కార్యక్రమాల్లో ఎంపిడిఓ బన్సీలాల్, వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు పాండు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.