Telangana

మహా శివరాత్రి మహా జాగరణ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

_భారీ సంఖ్యలో భక్తులు తరలిరావాలని విజ్ఞప్తి

_భక్తుల సంఖ్యకు అనుగుణంగా భారీ ఏర్పాట్లు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఈనెల 18వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో మహాశివరాత్రి మహా జాగరణ, స్వర లింగోద్భవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.శనివారం సాయంత్రం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కార్యక్రమ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహాశివరాత్రి సందర్భంగా 50 అడుగుల మహా శివలింగం, మహాశివుడి ప్రతిమలను ఏర్పాటు చేసి వేద పండితులచే మహన్యాస రుద్రాభిషేకం, శివపార్వతుల కళ్యాణం, ప్రముఖ సినీ నేపథ్య గాయకులచే సంగీత విభావరి,. సంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.భక్తులందరూ ఉపవాస దీక్ష విరమించిన అనంతరం శివపార్వతుల కళ్యాణం కనులారా వీక్షించి ఆ పరమశివుడి కృపకు పాత్రులు కావాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్,. మాజీ ఎంపిటిసి రామచంద్రారెడ్డి, భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, మెరాజ్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సెమీకండక్టర్ హబ్ గా భారతదేశం

గీతం కార్యశాల ప్రారంభోత్సవంలో ఐఐటీ భువనేశ్వర్ ప్రొఫెసర్ ఆశాభావం పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతదేశం ప్రపంచ సెమీకండక్టర్…

2 days ago

వచ్చే మూడు దశాబ్దాలూ వెక్టర్ డేటాబేస్ లదే

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న మాజీ ప్రొఫెసర్ సి.రాఘవేంద్రరావు పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాబోయే మూడు దశాబ్దాలు…

3 days ago

పోలీసుల సేవలు మరువలేనివి – కృష్ణ మూర్తి చారి

శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : పోలీసుల సేవలు మరువలేనివనీ కృష్ణ మూర్తి ఫౌండేషన్ చైర్మన్ కంజర్లకృష్ణ మూర్తి చారి అన్నారు.…

4 days ago

జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ గెలుపు ఖాయం యలమంచి ఉదయ్ కిరణ్

శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ‌లో ఉప ఎన్నిక‌లు జ‌రుగుతున్న జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గం హాట్ టాపిక్ గా మారింది.హైద‌రాబాద్ జిల్లా…

4 days ago

ప్రజా సంక్షేమమే మా లక్ష్యం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

19 మంది లబ్ధిదారులకు 7 లక్షల 22 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ పటాన్ చెరు ,మనవార్తలు…

4 days ago

పది సంవత్సరాల కృషి మూలంగానే పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు

అతి త్వరలో శాశ్వత ప్రాతిపాదికన పాలిటెక్నిక్ కళాశాల భవనం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు…

4 days ago