మన వార్తలు , అమీన్పూర్
గ్రామాల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అమీన్పూర్ మండల పరిధిలోని జానకంపేట, వడక్ పల్లి, దాయర, బొమ్మన్ కుంట, గండిగూడెం గ్రామాల్లో రెండు కోట్ల రూపాయలతో నిర్మించిన మిషన్ భగీరత ఓవర్హెడ్ ట్యాంకులు, పైపులైన్లు, మహిళా మండలి భవనాలను జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, ఎంపీపీ దేవానందం, స్థానిక ప్రజా ప్రతినిధులు తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించాలని సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టి ఇంటింటికి రక్షిత మంచి నీరు అందిస్తున్నారని అన్నారు.
ప్రతి ఒక్కరూ ప్రభుత్వం సరఫరా చేస్తున్న రక్షిత మంచినీరు నీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా ప్రణాళికలు రూపొందిస్తూ ప్రాధాన్యతా క్రమంలో నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు లలిత మల్లేష్, భాస్కర్ గౌడ్, కృష్ణ, మల్లేష్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజు, స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…