Telangana

చదువుల తల్లికి అండగా ఎమ్మెల్యే జిఎంఆర్

ఉన్నత విద్య కోసం రూ.1.50 లక్షల ఆర్థిక సహాయం

బాసర ట్రిపుల్ఐటీలో చేరనున్న విద్యార్థిని హర్షినికి ఉన్నత చదువులకు భరోసా

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

పేదరికం ప్రతిభకు అడ్డంకి కాకూడదన్న సంకల్పంతో పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఉన్నత విద్యను కొనసాగించే అవకాశాన్ని ఆర్థిక ఇబ్బందుల కారణంగా కోల్పోయే పరిస్థితిలో ఉన్న ఓ నిరుపేద విద్యార్థినికి రూ.1.50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించి ఆమె విద్యా భవిష్యత్తుకు అండగా నిలిచారు.తెల్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థిని హర్షిని, 574 మార్కులతో ప్రతిష్ఠాత్మకమైన బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించింది. కుటుంబ ఆర్థిక పరిస్థితులతో ఫీజులు చెల్లించడం సాధ్యం కాక, ఉన్నత విద్యపై ఆశలు సన్నగిల్లాయి.ఈ విషయాన్ని స్థానికులు ఎమ్మెల్యే జిఎంఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే విద్యార్థినిని, ఆమె కుటుంబ సభ్యులను పిలిపించి ధైర్యం చెప్పడంతో పాటు, బాసర ట్రిపుల్ఐటీలో ఆరు సంవత్సరాల విద్యాభ్యాసానికి అవసరమైన ఫీజుల నిమిత్తం రూ.1.50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రతిభ కలిగిన విద్యార్థులు కేవలం ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకు దూరం కాకూడదన్న లక్ష్యంతో హర్షిని ఉన్నత విద్యాభ్యాసానికి అండగా నిలిచామని తెలిపారు. భవిష్యత్తులోను సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.ఎమ్మెల్యే అందించిన సహాయానికి విద్యార్థిని హర్షిని, ఆమె కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

admin

Recent Posts

నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో రుద్రారం గణేష్ గడ్డ వరకు పాదయాత్ర

భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం  భక్తులకు…

5 hours ago

రుద్రారం శ్రీ గణేష్ దేవస్థానంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…

6 hours ago

పర్యావరణ శాస్త్రంలో కెజియా ఎలిజబెత్ కు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…

11 hours ago

సేవా కార్యక్రమాలతో జీఎంఆర్ జన్మదిన వేడుకలు

-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…

23 hours ago

రామచంద్రాపురంలో ఘనంగా ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదిన వేడుకలు

-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…

23 hours ago

పూరి బీచ్‌పై మెరిసిన ఎమ్మెల్యే జిఎంఆర్ సైకత శిల్పం

ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…

24 hours ago