అనంతగిరి బస్సు ప్రమాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

politics Telangana

సమాచారం తెలిసిన వెంటనే ఘటన స్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే జిఎంఆర్ 

వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులకు పరామర్శ 

మృతుల కుటుంబాలకు ఓదార్పు 

మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచన 

మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఎక్స్-గ్రేషియా 

10 లక్షల రూపాయలు ఎక్స్-గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ 

మృతులు, క్షతగాత్రులంతా పటాన్చెరు మండలం క్యాసారం గ్రామస్తులు 

బంధువుల అంత్యక్రియలకు వెళ్తున్న సమయంలో ప్రమాద ఘటన 

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్డులో ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . బస్సులో ప్రయాణిస్తున్న వారంతా సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పటాన్చెరు మండల పరిధిలోని క్యాసారం గ్రామస్తులు. సమాచారం అందిన వెంటనే హుటాహుటిన వికారాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులకు పరామర్శ. మెరుగైన వైద్య చికిత్స కోసం వెంటనే కార్పోరేట్ ఆస్పత్రులకు తరలించాలని అధికారులకు సూచన. మృతుల కుటుంబాలను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మీడియాతో మాట్లాడుతూ ప్రమాద ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. ప్రైవేట్ ట్రావెల్ డ్రైవర్ నిర్లక్ష్యం మూలంగానే ఘటన చోటుచేసుకుందని అన్నారు. ప్రమాద ఘటనపై పూర్తి విచారణ జరిపించి కారకులైన వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 10 లక్షల రూపాయల నష్టపరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం సైతం బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఓకే గ్రామానికి చెందిన ఐదుగురు మృతి చెందడం పట్ల ఎమ్మెల్యే జిఎంఆర్ తీవ్రంగా కలత చెందారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *