నేపాల్ పర్యటనలో ఎమ్మెల్యే జిఎంఆర్

politics Telangana

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి  నేపాల్ దేశంలో పర్యటిస్తున్నారు.ఆదివారం మాదేశ్ ప్రదేశ్ రాష్ట్రంలోని సీతాదేవి జన్మస్థలమైన జనక్ పూర్ జానకి మాత దేవాలయాన్ని స్థానిక ముఖ్యమంత్రి సరోజ్ కుమార్ యాదవ్ తో కలిసి ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ లు యాదగిరి యాదవ్, శ్రీశైలం యాదవ్, సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, దశరథ్ రెడ్డి, పాండు, రాజు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *