Districts

అమీన్పూర్ లో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

అమీన్పూర్

ప్రపంచంలో పూల ను పూజించే ఏకైక పండుగ బతుకమ్మ పండుగ అని, ఆ పండుగ రోజున మహిళలు అందరూ సంతోషంతో ఉండాలన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిఏటా బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్, ఎమ్మార్వో విజయ్ కుమార్, కమిషనర్ సుజాత, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, పార్టీ అధ్యక్షులు బాల్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

11 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

12 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago