పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, హిందూ మత గురువు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామిని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు మర్యాదపూర్వకంగా కలుసుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. ఆదివారం ఉదయం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్ శ్రీ సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారిని కలుసుకున్నారు. పటాన్చెరు నియోజకవర్గం నుండి మూడోసారి విజయం సాధించడం పట్ల స్వామి అభినందనలు తెలిపారు. నియోజకవర్గంలో 180 కి పైగా దేవాలయాలు నిర్మించడంతోపాటు, నూతన దేవాలయాల నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే జిఎంఆర్ వెంట తెల్లాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ లచ్చిరామ్ నాయక్, దాసు, సోదరుడి కుమారులు సంతోష్ గౌడ్, సందీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.