_ఇక్రిశాట్ తరఫున పటాన్ చెరు క్రికెట్ జట్టును ఆడించాలని వినతి
మనవార్తలు ,పటాన్ చెరు:
పటాన్ చెరు నియోజకవర్గాన్ని క్రీడల కేంద్రంగా చేయాలన్న లక్ష్యంతో చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఇక్రిసాట్ క్రికెట్ టీం తరపున పటాన్ చెరుక్రికెట్ టీం జట్టు అవకాశం కల్పించాలని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఇక్రిశాట్ అధికారులను కోరారు. సోమవారం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని ఇక్రిశాట్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సంస్థ డిప్యూటీ డైరెక్టర్ అరవింద్ కుమార్ తో ఈ అంశంపై చర్చించారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో సభ్యత్వం కలిగిన ఇక్రిశాట్ క్రికెట్ జట్టు గత 10 సంవత్సరాలుగా పోటీల్లో పాల్గొనడం లేదని, ఈ అవకాశాన్ని పటాన్ చెరుక్రికెట్ జట్టుకు కల్పించాలని ఆయన కోరారు. పటాన్ చెరు నియోజకవర్గానికి చెందిన ప్రతిభావంతులైన క్రికెట్ క్రీడాకారులను ఇక్రిసాట్ జట్టు తరఫున పోటీలో పాల్గొనే అవకాశం కల్పిస్తే, భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిపై ఇక్రిశాట్ అధికారులు సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.