కాలుష్య నియంత్రణ అధికారులు పై ఎమ్మెల్యే ఆగ్రహం…

Hyderabad politics Telangana

రెవెన్యూ సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదు

పటాన్ చెరు:

అభివృద్ధి పనుల విషయంలో పూర్తి పారదర్శకతతో పనిచేస్తూ, రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్తున్నట్టు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.

సోమవారం పటాన్ చెరు మండల పరిషత్ అధ్యక్షురాలు సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ధరణి వ్యవస్థను ఏర్పాటు చేసిన, నియోజకవర్గంలో ఇప్పటికీ రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ స్థాయిలో నాలుగు వేల పైచిలుకు భూ సమస్యల పరిష్కారానికి నోచుకోలేదని అన్నారు.

పటాన్ చెరు మండల పరిధిలో అపరిచిత భూ సమస్యల వివరాలను సమగ్ర నివేదిక రూపంలో రేపటిలోగా అందించాలని ఎమ్మార్వో మహిపాల్ రెడ్డి ని ఆదేశించారు. ఈ విషయంలో అలసత్వం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని సున్నితంగా మందలించారు.

ఇటీవల రుద్రారం, లకడారం గ్రమే చెరువులలో కాలుష్యం మూలంగా చేపలు చనిపోయాయని సభ్యులు సభ దృష్టికి తీసుకుని రాగా, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ప్రజలకు నమ్మకం కలిగేలా పనిచేయాలని సూచించారు. కాలుష్య కారక పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం కార్యాలయ ప్రాంగణంలో నిర్మించిన బాత్రూం, మరుగుదొడ్లు ప్రారంభించారు. ఈ సమావేశంలో జెడ్పిటిసి సుప్రజా వెంకట రెడ్డి, ఎంపీడీవో బాన్సిలాల్, ఎమ్మార్వో మైపాల్ రెడ్డి, సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *