మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
బీసీ రిజర్వేషన్లో తెలంగాణ దేశానికే ఆదర్శం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ చరిత్రాత్మకం, సువర్ణాక్షరాలతో లిఖించాల్సినరోజుఅని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆనందోత్సవాల మధ్య శేరిలింగంపల్లినియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ తో మియాపూర్ డివిజన్ నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈసందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా కుల గణన నిర్వహించి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందన్నారు.ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ జెనరల్ సెక్రటరీ దోర్నాల రవికుమార్ గౌడ్, బాలు మహేంద్ర, కె. రాంబాబు, సురేష్ యాదవ్, నవీన్ నేత, వివిధ కాలనిలకు చెందిన నాయకులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు