రెండు స్వర్ణ పతకాలు సాధించిన పాటిబండ్ల నవనీత్
మనవార్తలు ప్రతినిధి,మియాపూర్:
నేపాల్‌లోని పోఖరాలో ఆగస్టు 17 నుంచి 23, 2026 వరకు నిర్వహించిన తొలి ఇండో–నేపాల్ ఏరోస్కేట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో మియాపూర్ కెనరీ స్కూల్ విద్యార్థి పాటిబండ్ల నవనీత్ అద్భుత ప్రతిభ కనబరిచి రెండు స్వర్ణ పతకాలు సాధించాడు.ఈ అంతర్జాతీయ స్థాయి పోటీలో నవనీత్ తన ప్రతిభ, నైపుణ్యం, పట్టుదలతో ఆకట్టుకున్నాడు. టీమ్ ఈవెంట్‌లో ఒక స్వర్ణ పతకంతో పాటు, వ్యక్తిగత విభాగంలో మరో స్వర్ణ పతకం సాధించి విశేష విజయాన్ని నమోదు చేశాడు.నవనీత్ సాధించిన ఈ ఘన విజయంపై మియాపూర్ కెనరీ స్కూల్ యాజమాన్యం హర్షం వ్యక్తం చేస్తూ, అతని కృషి, క్రమశిక్షణ, పట్టుదలను అభినందించింది. భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో విజయాలు సాధించాలని ఆకాంక్షించింది.అతని వ్యక్తిగత కోచ్ ఖాదర్ బాషా, స్కూల్ కోచ్ మహేష్ కూడా నవనీత్‌ను అభినందిస్తూ, అతని క్రీడా ప్రస్థానం మరింత విజయవంతం కావాలని, భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.అంతర్జాతీయ వేదికపై రెండు స్వర్ణ పతకాలు సాధించిన నవనీత్ విజయం అతని కుటుంబానికి, మియాపూర్ కెనరీ స్కూల్‌కు, కోచ్‌లకు మరియు తెలుగు సమాజానికి గర్వకారణంగా నిలిచింది. యువ క్రీడాకారుడిగా అతను సాధించిన ఈ ఘనత, క్రీడల్లో రాణించాలనుకునే విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…