మెరుగైన జీవనం కోసం వలస : కతార్ ప్రొఫెసర్

politics Telangana

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

మెరుగెన జీవనం కోసం ప్రజలు వలస వెళుతుంటారని , దాదాపు 4.5 కోట్ల మంది భారతీయులు దేశంలో సంచార జీవనం గడుపుతున్నట్టు ఉంటారని ఖతార్లోని జార్జిటౌన్ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఉదయ్ చంద్ర అన్నారు . గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ ఆధ్వర్యంలో ‘ విదేశీయులు , సంచార వలసదారులు : భారతదేశంలో మానవ చలనశీలత యొక్క సామాజికశాస్త్రం ‘ అనే అంశంపై గురువారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు . గ్రామీణ ప్రాంతాల నుంచి ఇతర గ్రామాలకు , గ్రామాల నుంచి పట్టణాలకు , ఒక పట్టణం నుంచి మరో పట్టణానికి వంటి మూడు రకాల మానవ చలనశీలతలు ఉన్నట్టు ఆయన చెప్పారు . మెజారిటీ వలసదారులు భారతదేశం అంతటా సంపన్న పట్టణ ప్రాంతాలలో ఉపాధి పొందుతున్నారని , అందులో అత్యధిక శాతం మంది అనధికారిక ఆర్థిక వ్యవస్థలో , అనిశ్చిత పరిస్థితులలో , తక్కువ ఉద్యోగ భద్రతతో పనిచేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు .

మానవ చలనశీలత చారిత్రక నేపథ్యాలను ఆయన వివరిస్తూ , కాలానుగుణంగా , వాతావరణ మార్పులను బట్టి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రజలు వలస వెళుతుంటారన్నారు . కొండ ప్రాంత ప్రజలు అననుకూల వాతావరణ పరిస్థితులలో మెదైన ప్రాంతానికి వస్తుంటారని , అలాగే స్థానికంగా ఉపాధి లభించనప్పుడు పట్టణ ప్రాంతాలకు వెళతారని , మళ్లీ స్థానికంగా పని లభించేటప్పుడు వారంతా తిరిగొస్తారని చెప్పారు . వలసల ఆర్థిక సిద్ధాంతాలు మానవ చలనశీలత యొక్క సామాజిక సాంస్కృతి తర్కాన్ని పట్టుకోలేవని ఆయన స్పష్టీకరించారు . విద్యార్థులు సంధించిన పలు ప్రశ్నలకు ఆయన జవాబులిచ్చారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *