లయన్స్ క్లబ్ భవన నిర్మాణానికి 10 లక్షలు అందించిన ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ దేవేందర్ రాజు

Districts Telangana

మన వార్తలు , పటాన్ చెరు:

పటాన్ చేరు పట్టణంలో నూతనంగా నిర్మించే లయన్స్ క్లబ్ భవనానికి పటాన్ చెరు మాజీ సర్పంచ్, టిఆర్ఎస్ నాయకులు, ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు ముదిరాజ్ పది లక్షల చెక్కును అందజేశారు. జైపాల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్మించే ఈ భవనానికి ఆదివారం పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన దేవేందర్ రాజు ముదిరాజ్ గారు పది లక్షల చెక్కు జై పాల్ ముదిరాజ్ గారి సమక్షంలో మహిపాల్ రెడ్డి అందజేశారు. దేవేందర్ రాజు అనేక సందర్భాలలో ప్రజలకు అండగా నిలుస్తూ పటాన్ చెరు నియోజకవర్గ ప్రజలతో పాటు సంగారెడ్డి జిల్లా ప్రజలకు ఆపద్బాంధవుడిగా నిలుస్తున్నారు. ఆర్థిక సంబంధాలే మానవ సంబంధాలు గా మారిన నేటి తరుణంలో పేదలకు అన్నీ తానై నిలబడుతూ అందరి ఆదరాభిమానాలు చూరగొంటున్నారు.

అనాధ శవాలకు అంత్యక్రియలు నిర్వహించడంతోపాటు విద్యార్థులు, పేద ప్రజలు, క్రీడాకారులు ఇలా అన్ని రంగాల ప్రజలకు ఎల్లవేళలా తాను ఉన్నానంటూ ఉన్నతమైన సేవలందిస్తున్నారు. అలాంటి దేవేందర్ రాజు లయన్స్ క్లబ్ భవనానికి 10 లక్షలు అందించి మరోమారు తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా దేవేందర్ రాజు ముదిరాజ్ మాట్లాడుతూ పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తూ ఉచితంగా ల్యాబ్ ఏర్పాటు చేస్తూ పేదలకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్న టువంటి లయన్స్ క్లబ్ భవనం పటాన్ చెరులో నిర్మించడం సంతోషదాయకం అన్నారు.

వీటితోపాటు లయన్స్ క్లబ్ వివిధ సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను ఆదుకుంటుందని అన్నారు. ప్రజోపయోగ కార్యక్రమాలకు తన సహకారం ఎల్లవేళలా ఉంటుందని మరోమారు నిరూపించిన దేవేందర్ రాజు గారిని ప్రజలందరూ ఆదర్శప్రాయుడుగా పేర్కొంటున్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కుమార్ యాదవ్ గారు, మరియు లయన్స్ క్లబ్ మెంబెర్స్ తదితరులు  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *