మన వార్తలు ,పటాన్చెరు:
ప్రతి పేదవాడికి నేనున్నా అంటూ ఆపదలో ఉన్నవారికి అదుకొంటూ సాయం అడిగిన వారికి సాయంగా నిలుస్తూ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఎండిఆర్ ఫౌండేషన్ చేయూతనందించి.మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఎండిఆర్ ఫౌండేషన్ ఫౌండేషన్ చైర్మన్, టిఆర్ఎస్ నాయకులు, పటాన్చెరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు విద్యార్థి విష్ణువర్ధన్ రెడ్డికి 20 వేల రూపాయలు సహాయం అందజేశారు.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కు చెందిన విద్యార్థి పటాన్ చెరులో ఉంటూ విద్యనభ్యసిస్తున్నాడు. అతనికి ఎల్లంకి కళాశాలలో బీటెక్ లో సీటు వచ్చింది. కానీ పేదరికం కారణంగా ఫీజు కట్టలేని స్థితిలో ఉన్నా ఆయన సహాయం చేయాలంటూ ఎండిఆర్ ఫౌండేషన్ ను సంప్రదించారు. దీంతో అతని ఫీజు నిమిత్తం 20,000 రూపాయలను అందించారు.
అనంతరం మాట్లాడుతూ దేవేందర్ రాజు మట్టిలో మాణిక్యం లాంటి అనేకమంది పేదలు ఆర్థిక స్థోమత లేక చదువుకు దూరమవుతున్నారు మంచి మనసుతో ఇలాంటి వారికి ప్రోత్సాహాన్ని అందిస్తే దేశానికి ఉపయోగపడే పౌరులుగా ఎదుగుతారని, చరిత్రలో అనేక మంది పేద వర్గాల నుండి వచ్చిన వారు దేశంలోని అత్యున్నత స్థానాలను అధిరోహించారని ఎండిఆర్ ఫౌండేషన్ ఫౌండేషన్ చైర్మన్ మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గుర్తుచేశారు. విష్ణువర్ధన్ రెడ్డి కూడా శ్రద్ధతో చదివి మరికొంతమందికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.