Telangana

రాష్ట్ర ప్రజలందరి పై శ్రీ వారి ఆశీస్సులుండాలి  నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖ శాంతులతో వర్ధిల్లాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వనపర్తి జిల్లా శ్రీ రంగాపురం మండల కేంద్రంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గారితో కలిసి ఉత్తర ద్వారం ద్వారా రంగ నాయక స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు వారికి ఘన స్వాగతం పలికారు. నీలం మధు మాట్లాడుతూ విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వైకుంఠానికి తరలి వెళ్లిన ముక్కోటి దేవతలతో కలిసి స్వామి భూలోకానికి వచ్చే శుభ సందర్భాన్ని ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారన్నారు . వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వారా దర్శనంతో స్వామివారిని దర్శించుకుంటే జన్మజన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని భక్తులు విశ్వసిస్తారని తెలిపారు.

ఆ దేవదేవుడు ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ఉండి రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. శ్రీ రంగ నాయక ఆలయ ప్రాంగణంతో పాటు ఆలయం చుట్టు ఉన్న రంగసముద్రం కొలను చూడమచ్చటగా ఉందన్నారు. దేవాలయ నిర్మాణలతో పాటు ఆలయాల అభివృద్ధికి సహకరించే విషయంలో తానెప్పుడూ ముందుంటానన్నారు. అనంతరం శ్రీ రంగ సముద్రం తో పాటు రిజర్వాయర్ ను, మ్యూజియం ను వారు సందర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ యాదవ్,డా,,పగిడాల శ్రీనివాస్, చొప్పరి వెంకటయ్య,నరేష్, పి వెంకటయ్య, ఎం రఘు,ఆంజనేయులు,మూర్తి,కృష్ణయ్య,బిసన్న,కృష్ణ, ఈశ్వరయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు,భక్తులు, తదితరులు పాల్గొన్నారు

admin

Recent Posts

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

7 hours ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

7 hours ago

గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…

7 hours ago

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

19 hours ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

22 hours ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

2 days ago