_బొల్లారంలో వైభవంగా భూ సమేత వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
_పూర్ణకుంభంతో నీలం మధుకు ఘన స్వాగతం పలికిన అర్చకులు
మనవార్తలు ,బొల్లారం:
ఆపద మొక్కుల వాడు అనాథ రక్షకుడు భక్తుల కోర్కెలు తీర్చే కలియుగ దైవం వేంకటేశ్వరుడు అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటేస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.
బుధవారం పటాన్చెరు నియోజకవర్గం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ సుజాతమహేందర్ రెడ్డి, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి అష్టాదశ వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆయన స్థానిక నాయకులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయంలో నీలం మధు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నీలం మధు మాట్లాడుతూ దేవాలయాలలో నిర్వహించే ఉత్సవాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుందని తెలిపారు.ప్రతి ఒక్కరూ భక్తి భావం అలవర్చుకుంటే పోటీ ప్రపంచంలో పెరుగుతున్న ఒత్తిడిని జయించవచ్చన్నారు. వెంకటేశ్వర స్వామి కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుడని, ఆ బ్రహ్మాండ నాయకుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు,ఈ కార్యక్రమంలో బొల్లారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి, తాజా మాజీ కౌన్సిలర్ చంద్రారెడ్డి, కార్మిక సంఘం నాయకులు వరప్రసాద్ రెడ్డి, సీనియర్ నాయకులు తలారి కృష్ణ,శంకర్, రాజ్ గోపాల్,ధర్మ రావు,బాలరాజు, ఆలయ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.