మాస్కే శ్రీరామ రక్ష….
-డాక్టర్ జీవీఎస్ రావు
హైదరాబాద్ సిి :
భౌతిక దూరం పాటించడంతో పాటు… మాస్క్ ధరించడంతోనే కరోనా గోలుసును తెంపవచ్చని డాక్టర్ రావూస్ ఈఎన్‌టీ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ జీవీఎస్ రావు అన్నారు .
హైదరాబాద్ ఎంజీబీఎస్, కాచీగూడ రైల్వే స్టేషన్ , కేపీహెచ్‌బీ బస్టాండ్‌లో డాక్టర్ రావూస్ ఈఎన్‌టీ ఆసుపత్రి ,హైదరాబాద్ ఈఎన్‌టీ రీసెర్చ్ ఫౌండేషన్ సంయుక్తంగా వలస కూలీలకు, ప్రయాణీకులకు ఉచితంగా మాస్కులు , వాటర్ బాటిల్స్, ఆహార పదార్థాల పంపిణీ చేశారు. 18 ఏళ్ళ నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ,కోవిద్ వచ్చినా త్వరగా కోలుకుంటారని చెప్పారు. కరోనా నుంచి రక్షణ కోసం మాస్క్‌లు ,గ్లౌజ్‌లు, శానిటైజర్లు వాడాలని పిలుపునిచ్చారు.
కోవిద్ 19 అనేది శ్వాసకోస వ్యాధి అని … దగ్గినప్పుడు ,తుమ్మినప్పుడు ,తుంపర్ల ద్వారా ఒకరినుంచి మరొకరికి సంక్రమిస్తుందని డాక్టర్ జీవీఎస్ రావు అన్నారు.ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడం ద్వారానే కోవిద్ వ్యాప్తికి అడ్డుకట్టవేయవచ్చన్నారు .ఇలా ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా మాస్క్ సాయం చేస్తే .. కొంత మంది పేదలైనా కరోనా బారిన పడకుండా కాపాడుకోగలుగుతామన్నారు. భాగ్యనగరంలో పది వారాల పాటు రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఉచితంగా లక్ష మాస్కులు, వాటర్ బాటిల్స్, ఆహార పదార్థాలను అందిస్తున్నట్లు డాక్టర్ రావ్ తెలిపారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…