Categories: politics

నిరుద్యోగ దీక్షను విజయవంతం చేయండి : బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు , పటాన్ చెరు:

తెలంగాణ లో బిజెపి పార్టీ మరో పోరాటానికి సిద్ధమైంది రాష్ట్రంలో నిరుద్యోగుల తరుపున మరో మారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుబండి సంజయ్ చేస్తున్న దీక్షకు మద్దతు ఇవ్వాలని పటాన్ చెరు మాజీ జెడ్పీటీసీ, బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ పిలుపునిచ్చారు .ఇస్నాపూర్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమవేశంలో మాట్లాడుతూ ఈనెల 27న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఇందిరాపార్క్‌‌‌‌‌‌‌‌ ధర్నా చౌక్‌‌‌‌‌‌‌‌ వద్ద బీజేపీ తెలంగాణ శాఖ అధ్వర్యంలో ఒక రోజు నిరుద్యోగ నిరసన దీక్ష చేపడ్తున్నా బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష నిర్వహించన్నురని తెలిపారు .

నీళ్లు ,నిధులు నియమాకాలు నినాదంతో తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది యువకులు పాల్గొన్నారని , టీఆరెఎస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి అమలు చేస్తామని 2018లో రెండవ సారి అధికారంలోకి‌ వచ్చిన టీఆర్ఎస్ మూడుయేళ్లు దాటినా ఈ హామీని నెరవేర్చలేదు,ఉద్యోగాలు లేక నిరుద్యోగ భృతి అందక యువత ఆవేదనలో ఉంటే కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయకపోతే రాబోయే ఎలక్షన్స్ లో టీఆరెఎస్ పార్టీకి బుద్ధిచెప్తారని అన్నారు

ఒక రోజు నిరుద్యోగ నిరసన దీక్షకు రాష్ట్ర నలుమూలల నుంచి నిరుద్యోగులు, యువత పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో సరోత్తం రెడ్డి, జోగు ధన్ రాజ్, దుర్గా సాయి తదితరులు పాల్గొన్నారు

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago