పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పిలుపు
పటాన్చెరు
రేపు నిర్వహించనున్న టిఆర్ఎస్ పార్టీ జెండా పండుగను విజయవంతం చేయాలని పటాన్చెరువు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు ఒక ప్రకటనలో పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు, కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు నియోజకవర్గ పరిధిలోని 55 గ్రామపంచాయతీలు, నాలుగు మండలాలు, మూడు మున్సిపాలిటీలు, మూడు డివిజన్ల పరిధిలో పార్టీ జెండాలను ఎగురవేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజా ప్రతినిధులు, పార్టీ బాధ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువతీ యువకులు, విద్యార్థులు, రైతులు కార్మికులు అందరిని భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాలను నిర్వహించాలని ఆయన కోరారు.