అట్టహాసంగా ముగిసిన మైత్రి గోల్డ్ కప్ క్రికెట్ ట్రోఫీ

politics Telangana

_క్రీడలకు కేంద్రం మైత్రి మైదానం..

_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_విజేతలుగా నిలిచిన రెడ్ డ్రాగన్.. రన్నర్స్ గా నిలిచిన ప్రిన్స్ ఎలెవన్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానాన్ని రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడలకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.మైత్రి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో గత తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న మైత్రి గోల్డ్ కప్ క్రికెట్ ట్రోఫీ ముగింపు పోటీలు గురువారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.హోరాహోరీగా సాగిన ఫైనల్స్ లో రెడ్ డ్రాగన్ జట్టు విజేతలుగా నిలువగా, ప్రిన్స్ ఎలెవెన్ రన్నర్స్ గా నిలిచింది.విజేతలకు లక్ష ఇరవై వేల రూపాయలు నగదు బహుమతి, రన్నర్స్ కి 75 వేల రూపాయలు నగదు బహుమతి అందజేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. దశాబ్దాల చరిత్ర కలిగిన మైత్రి స్టేడియాని ఇటీవల ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలతో ఆధునికరించామని గుర్తు చేశారు. పగలతో పాటు రాత్రి సమయంలో సైతం క్రీడలు నిర్వహించేలా హై మాస్ట్ విద్యుత్ లైట్ల సదుపాయాన్ని ఏర్పరిచామని తెలిపారు. సంవత్సరం పొడువునా వివిధ క్రీడా అంశాల్లో జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో క్రీడలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. మైత్రి క్రికెట్ క్లబ్ తరఫున రంజీలో పాల్గొనేలా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తో చర్చించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుండి ప్రతిభ కలిగిన క్రీడాకారులను ఎంపిక చేసి శిక్షణ అందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ పోటీలకు హాజరవుతున్న నియోజకవర్గ క్రీడాకారులకు ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు తెలిపారు. నగదు బహుమతులను ఎస్ ఆర్ గ్రూప్ ఇండస్ట్రీస్ అందజేసింది.

ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ గోదావరి అంజిరెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఆదర్శ్ రెడ్డి, క్రైమ్ సీఐ బీసన్న, మైత్రి క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, ప్రకాష్ రావు, పృథ్వి రాజ్, క్రీడాకారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *