పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
మహాత్ముడు చూపిన మార్గం అందరికీ అనుసరణీయమని ఎండీఆర్ ఫౌండేషన్ కో ఫౌండర్, బీఆర్ఎస్ యువ నాయకుడు మాదిరి ప్రిథ్వీరాజ్ అన్నారు.గాంధీ జయంతిని పురస్కరించుకొని పటాన్ చెరు పట్టణంతో పాటు అల్విన్ కాలనీ లో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి , కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో కలిసి మాదిరి ప్రిథ్వీరాజ్ మహాత్ముడి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాదిరి ప్రిథ్వీ రాజ్ శాంతి, అహింస అనే ఆయుధాలతో దేశానికి దాస్య శృంఖలాల నుంచి విముక్తి కల్పించిన గొప్ప చరిత్ర గాంధీ సొంతమన్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా దేశ ప్రజలందరినీ ఆయన ఒక్కతాటి మీద నడిపించారన్నారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తామన్నారు. ఆయన అహింస తత్వశాస్త్రం భారతదేశ స్వాతంత్ర్య పోరాటాన్ని మార్చడమే కాకుండా సామాజిక న్యాయం, శాంతి కోసం ప్రపంచ ఉద్యమాలను ఎలా ప్రేరేపించిందో చెప్పారు. ఐక్యరాజ్య సమితి అక్టోబరు 2వ తేదీని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా గుర్తించిందని, పేర్కొన్నారుఈ కార్యక్రమంలో విజయ్ గారు,మధు గారు,ఆఫజల్ గారు,నరసింహ రెడ్డి గారు,శ్రీధర్ గారు మరియు స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు