పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్బంగా చిట్కుల్లోని ఎంపీ అభ్యర్థి కార్యాలయంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం నీలం మధు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే అందరికీ ఆదర్శనీయుడని, అంటరానితనం, కుల వ్యవస్థ, అణగారిన కులాలకు విద్యను అందించడంలో ఆయన కృషి ఎనలేనిదని తెలిపారు . అలాగే అణగారిన వర్గాల అభివృద్ధి, వారి రాజకీయ న్యాయం అందించడానికి నిరంతరం పోరాటం చేశారని ,సమాజంలో వివక్షకు తావు లేదని సమానత్వం ఉండాలని , జీవితాంతం పోరాడిన మహనీయుడని కొనియాడారు . వెనుకబడిన వర్గాలకు దళిత జనోద్ధారణకు ఆయన ఎంచుకున్న బాట అనుసరించిన మార్గం సమాజ శ్రేయస్సు కొరకు వారందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు . ఆధునిక భారతదేశంలో సామాజిక న్యాయం మహిళా సాధికారత ఉద్యమాలకు ఆద్యులు చదువులతోనే సమన్వయం అభివృద్ధి సాధ్యమని నమ్మిన మహాత్ముడు అని ఆయన మార్గంలోనే మనం పయనించాలని నీలం మధు ముదిరాజు అన్నారు .

