ఇష్టపడి చదవండి.. ఉన్నత శిఖరాలను అధిరోహించండి_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

politics Telangana

రామచంద్రాపురం,మనవార్తలు ప్రతినిధి :

కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు.రామచంద్రపురం డివిజన్ పరిధిలోని శ్రీ గీతా భూపాల్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలను సోమవారం కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పటాన్చెరు ప్రాంతంలోని నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో 17 సంవత్సరాల క్రితం అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సహాయ సహకారాలతో భూపాల్ రెడ్డి ఈ కళాశాలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాల అయినప్పటికిని కళాశాల అభివృద్ధికి అనునిత్యం అండగా నిలుస్తూ విద్యార్థులను బావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో భూపాల్ రెడ్డి పాత్ర ప్రశంసనీయమన్నారు. ప్రభుత్వం ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతానికి కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తుందని, కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా అన్ని మౌలిక వసతులు కల్పిస్తుందని అన్నారు. శ్రద్ధసక్తులతో చదివి తల్లిదండ్రులకు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకుని రావాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కళాశాల విద్యార్థినీ విద్యార్థులు నిర్వహించిన సంస్కృతి కార్యక్రమాలు అందరిని అల్లరించాయి. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ ఎంపీపీ దేవానందం, జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ అంజయ్య, సీనియర్ నాయకులు సోమిరెడ్డి, పరమేష్, కుమార్ గౌడ్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *