_పదో తరగతి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస నిపుణులచే కొలిచే ప్రత్యేక తరగతులు
_7000 మంది విద్యార్థులకు సొంత నిధులచే ప్రత్యేక మోటివేషన్ క్లాసులు, పరీక్షా సామాగ్రి పంపిణీ..
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
విద్యార్థి జీవితంలో 10వ తరగతి పరీక్షలు అత్యంత కీలకమని, ఇష్టపడి చదివి.. అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు సూచించారు. మంగళవారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్లో.. పటాన్చెరు అమీన్పూర్ రామచంద్రపురం మండలాలతో పాటు తెల్లాపూర్ అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి విద్యనభ్యసిస్తున్న విద్యార్థినీ విద్యార్థులకు జి.వి.ఆర్ ఎంటర్ప్రైజెస్ సంస్థ సౌజన్యంతో ఏర్పాటు చేసిన వ్యక్తిత్వ వికాస ప్రేరణ తరగతులను ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన పదవ తరగతి పరీక్ష సమయంలో ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి అన్న అంశంపై ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ వీరేందర్ చే ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పరీక్షలు ప్రారంభమయ్యే వరకు ఇంట్లో ఫోన్లో, టీవీలకు పిల్లలను దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం సొంత నిధుల చే కొనుగోలు చేసిన పరీక్ష మెటీరియల్ విద్యార్థులకు పంపిణీ చేశారు. అనంతరం వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ వీరేందర్, డాక్టర్ పూర్ణ కృష్ణ, ఎంఈఓ రాథోడ్ లు ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పిటిసిలు సుధాకర్ రెడ్డి, సుప్రజా వెంకట్ రెడ్డి, దశరథ్ రెడ్డి, పట్నం రాజు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.