_ప్రతి గడపకు సంక్షేమం.. ప్రతి గ్రామంలో అభివృద్ధి..
_సబ్బండ వర్గాల సంక్షేమం కోసం జిఎంఆర్ నవరత్నాలు
_పేదలు, రైతులు, మహిళల సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమం మరింత ముందుకు వెళ్లాలంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ పార్టీకి ఘన విజయం అందించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పథకాలను కొనసాగించడంతో పాటు… అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ రూపొందించిన మేనిఫెస్టోకి అనుబంధంగా నవరత్నాల పేరుతో 9 అద్భుతమైన పథకాలను నియోజకవర్గ ప్రజలకు అందించబోతున్నట్లు తెలిపారు.సోమవారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ లతో కలిసి మాట్లాడారు.సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన పార్టీ మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించబోతున్నట్లు తెలిపారు. ప్రధానంగా మహిళలు, రైతులు, పేదల సంక్షేమానికి పెద్దపీట వేశారని తెలిపారు.గత పది సంవత్సరాల కాలంలో పటాన్చెరు నియోజకవర్గంలో 9000 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు.పార్టీ మేనిఫెస్టోకి అనుబంధంగా పటాన్చెరు నియోజకవర్గ ప్రజల కోసం జిఎంఆర్ నవరత్నాల పేరుతో 9 పథకాలను ప్రకటించడం జరిగిందని తెలిపారు. వీటితోపాటు పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని లారీ మరియు ఆటో డ్రైవర్లకు, ఫోటోగ్రాఫర్లకు 15 లక్షల రూపాయల విలువైన హెల్త్ ఇన్సూరెన్స్ అందించనున్నమని తెలిపారు.
పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని 55 గ్రామపంచాయతీలు, మున్సిపల్ కేంద్రాలు, జిహెచ్ఎంసి డివిజన్లకు అంబులెన్సులు.
ప్రతి గ్రామంలో మహిళా సమాఖ్య భవనాల నిర్మాణం.
ప్రతి మండలానికి స్టేడియం.
కులం, మతం, ప్రాంతం తేడా లేకుండా ప్రతి వర్గానికి ఫంక్షన్ హాల్ నిర్మాణం.
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే ఒక లక్ష 25 వేల రూపాయలతో పాటు పట్టుచీర పంపిణీ.
నిరుద్యోగ యువతీ యువకులకు పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణా కేంద్రం..
గుమ్మడిదల, అమీన్పూర్ మండలాల పరిధిలో నూతన జూనియర్ కళాశాలల ఏర్పాటు.
గుమ్మడిదల మండల రైతుల కోసం ఆధునిక వసతులతో గోదాము నిర్మాణం.
పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని హిందూ, ముస్లిం, క్రిస్టియన్ల కమ్యూనిటీల కోసం 15 ఎకరాల విస్తీర్ణంలో మూడు వైకుంఠధామాల నిర్మాణం.
పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు విజ్ఞులని, తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపిన సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి అందిస్తారని తెలిపారు.పటాన్చెరు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం, సీఎం కేసీఆర్, మంత్రుల కేటీఆర్, హరీష్ రావు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, కార్యకర్తల సహకారంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్చెరులో మూడోసారి బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ లు మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్ అద్భుతమైన మేనిఫెస్టోను రూపొందించారని తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం బిఆర్ఎస్ మేనిఫెస్టో, జిఎంఆర్ నవరత్నాల బ్రోచర్‌ను ఆవిష్కరించారు.ఈ సమావేశంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.