పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ లోని స్కూల్ ఆఫ్ సెన్స్, ఫిజిక్స్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ ఐ.వి.సుబ్బారెడ్డికి ఏపీజే అబ్దుల్ కలాం బెస్ట్మ్ అచీవ్ మెంట్ (జీవితకాల సాఫల్య) అవార్డు వచ్చింది. బెంగళూరులోని సామాజిక, ఆర్ధికాభివృద్ధి జాతీయ విద్యా సంస్థ ఇటీవల ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలో ఈ అవార్డును ఇచ్చి సత్కరించినట్టు గీతం వర్గాలు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నాయి. దేశాభివృద్ధి, బోధన, పరిశోధన, పత్ర సమర్పణలో డాక్టర్ ఐనీ చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డును ఇచ్చినట్టు తెలిపారు. అడ్వాన్స్ సెంటర్ ఫర్ అట్మాస్ఫియరిక్ సెనైన్ నుంచి జూనియర్ రీసెర్చ్ ఫెలోగా, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ నుంచి సీనియర్ రీసెర్చ్ ఫెలోతో పాటు సీఐఎస్ఆర్ నుంచి యంగ్ అండ్ డైనమిక్ రీసెర్చ్ స్కాలర్ డాక్టర్ రెడ్డిఇంతకు మునుపు గుర్తింపు పొందినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. జీవితకాల సాఫల్య పురస్కారం అందుకున్న డాక్టర్ సుబ్బారెడ్డిని స్కూల్ ఆఫ్ సెర్చ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె.నగేష్, భౌతిక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ టి.విశ్వం తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో వివరించారు.
గీతం కార్యశాల ప్రారంభోత్సవంలో ఐఐటీ భువనేశ్వర్ ప్రొఫెసర్ ఆశాభావం పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతదేశం ప్రపంచ సెమీకండక్టర్…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న మాజీ ప్రొఫెసర్ సి.రాఘవేంద్రరావు పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాబోయే మూడు దశాబ్దాలు…
శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : పోలీసుల సేవలు మరువలేనివనీ కృష్ణ మూర్తి ఫౌండేషన్ చైర్మన్ కంజర్లకృష్ణ మూర్తి చారి అన్నారు.…
శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణలో ఉప ఎన్నికలు జరుగుతున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది.హైదరాబాద్ జిల్లా…
19 మంది లబ్ధిదారులకు 7 లక్షల 22 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ పటాన్ చెరు ,మనవార్తలు…
అతి త్వరలో శాశ్వత ప్రాతిపాదికన పాలిటెక్నిక్ కళాశాల భవనం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు…