మనవార్తలు, రామచంద్రాపురం :
కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ మరియు టిఆర్ఎస్ పటాన్ చెరు సర్కిల్ 22 బీసీ సెల్ ప్రెసిడెంట్ కంజర్ల కృష్ణమూర్తి చారి నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి కి రామచంద్రపురం లోని గీత భూపాల్ రెడ్డి కళాశాలలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అంజయ్య, కుమార్ గౌడ్, మోహన్ రెడ్డి, ఐలేష్ ,నర్సింగ్ రావు, సుధాకర్ రావు, గిరి, చంద్రశేఖర్, యాదయ్య, కుమార్, భాస్కర్, ప్రమోద్ గౌడ్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.