_ప్రణాళికాబద్ధంగా గ్రామాల అభివృద్ధి
_నాలుగు లక్షల రూపాయల సొంత నిధులచే ట్రాక్టర్ డోజర్ ల పంపిణీ
మనవార్తలు ,అమీన్పూర్
నియోజకవర్గపరిధి లోని గ్రామాలకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తూ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళుతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం అమిన్ పూర్ మండల పరిధిలోని సుల్తాన్పూర్, వడక్ పల్లీ గ్రామాలలో కోటి 18 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన సిసి రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మండల పరిధిలోని ఐదు గ్రామ పంచాయతీల ట్రాక్టర్లకు నాలుగు లక్షల రూపాయల సొంత నిధుల చే డోజర్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామ పంచాయతీని మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నిధుల కొరత ఉన్నప్పటికిని సి ఎస్ ఆర్ నిధుల సహకారంతో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. సుల్తాన్ పూర్ గ్రామంలో సి సి రోడ్డు నిర్మాణానికి కోటి నాలుగు లక్షల రూపాయలు అందించిన టి ఎస్ ఐ ఐ సి కి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులతో పాటు జిల్లా పరిషత్తు నుండి మంజూరైన నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్టు తెలిపారు.
అనంతరం పటేల్ గూడా గ్రామంలో నిర్మిస్తున్న దుర్గమ్మ దేవాలయం స్లాబ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, ఎంపీపీ దేవానందం, ఎంపీడీవో మల్లేశ్వర్, సర్పంచులు లలిత మల్లేష్, మల్లేష్, రవి, భాస్కర్ గౌడ్, పాండు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజు, శ్రీకాంత్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…