హైదరాబాద్ లో లోఓబాక్స్ కియోక్స్ ప్రారంభం

Hyderabad Lifestyle

హైదరాబాద్:

 

టాలీవుడ్ సెలబ్రెటీల సందడే సందడి ..ఆకట్టుకున్న ఫ్యాషన్ షో

అందాల తారల తళకులు మధ్య లోఓబాక్స్ హైదరాబాద్ మొదటి ఫిజికల్ కియోస్క్ ప్రారంభమైంది. పలు విదేశాల్లో ప్రాచుర్యం పొందిన బ్యూటీ కాస్మోటిక్ ఉత్పత్తలను దేశీయ మార్కెట్లోవినియోగదారులకు అందించేందుకు జూబ్లీహిల్స్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ,లోఓబాక్స్ కియోస్క్ లాంచ్ పార్టీ తారల సందడితో కళకళలాడింది. ప్రత్యేక అతిధిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిప ల్ సెక్రటరీ జయే ష్ రంజన్, నటుడు విశ్వక్ సేన్ తో పాటు టాలీవుడ్ నటి శ్రీదేవి విజయ్ కుమార్, నిత్యా నరేష్, నిత్యాశెట్టి, బిగ్ బాస్ ఫేమ్ ధివి తదితరులు కలిసి లూహో బాక్స్ కియోస్క్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా హైదరాబాదీ మోడళ్లతో నిర్వహించిన ఫ్యాషన్ షో కనువిందు చేసింది.

Tollywood Actors Sizzles At LUJOBOX Kiosks Launch Party - Social News XYZ

ఈ సందర్బంగా లోఓబాక్స్ సంస్ధ కో -ఫౌండర్, స్వప్న బొజ్జ మాట్లాడుతూ ఆన్ లైన్ ద్వారా సేవలను అందించిన తమ సంస్ద కియోస్క్ విభాగంలోకి అడుగుపెట్టిందన్నారు. రానున్న ఆరు నెలల్లో ప్రధాన నగరాలైన కోల్ కత్తా, ధీల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబాయ్ వంటి ప్రాంతాల్లో అరవై కి పైగా వీటిని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వినియోగదారులు తమకు కావాల్సిన పలు దేశాల బ్రాండ్లైన హెయిర్, ఫేస్, భాడీ కేర్, కలర్ కాస్మోటిక్స్ ఈ బాక్స్ ద్వారా పొందవచ్చని, కస్టమైజ్ ఎంపిక కూడా ఈ బాక్స ప్రత్యేకత అని వివరించారు. సంస్ధ సిఇఓ అండ్ ఫౌండర్ అమిత్ గిరి, డైరెక్టర్ స్టాటర్జీ అండ్ ఇన్నోవేషన్స్ భాను రెడ్డి వరాల, కళామందిర్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *