– లడ్డూను దక్కించుకున్న ఇంద్రేశం గ్రామస్తుడు
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఇస్నాపూర్ గ్రామంలో గణేష్ మహారాజ్ యూత్ ఆధ్వర్యంలో గణనాథునీ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరిగాయి. వినాయకుడి నిమజ్జనం రోజు అయిన బుధవారం రాత్రి జరిగిన గణనాథునీ మహా ప్రసాదం వేలం పాటలో రెండు లక్షలకు పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన రాచమల్ల నరేందర్ గౌడ్ లడ్డును దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా నరేందర్ గౌడ్ మాట్లాడుతూ… ఆ గణనాధుని కటాక్షం తో ఇంద్రేశం గ్రామంలోని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నట్లు చెప్పారు. వేలంపాటలో లడ్డును దక్కించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూత్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.